బండిసంజయ్ ఆఫీస్ ముట్టడికి.. విద్యార్థి సంఘాల యత్నం,అరెస్ట్ 

కరీంనగర్: నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎంపీ బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు విద్యార్థులు. బండిసంజయ్ కార్యాలయం వైపు ర్యాలీ గా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు.